హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి - ట్రాఫిక్ ఎస్సై మనోహర్, ఏ ఎస్సై సోమనాథ్ వాహనదారులకు విజ్ఞప్తి 

హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి -  ట్రాఫిక్ ఎస్సై మనోహర్, ఏ ఎస్సై సోమనాథ్ వాహనదారులకు విజ్ఞప్తి 

హస్తినాపురం లో వాహనదారులకు సూచనలు

 మీకోసం మీ కుటుంభం ఎదురుచూస్తుంది 

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతా పై అవగాహన

విశ్వంభర, హస్తినాపురం : తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు రాచకొండలోని ట్రాఫిక్ శిక్షణా సంస్థ సిబ్బంది రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిఒక్కరు తలకు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎల్బీ నగర్ పరిధిలోని హస్తినాపురం ట్రాఫిక్  సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ ఎస్సై మనోహర్, ఏ ఎస్సై సోమనాథ్ ప్రజలకు , వాహనదారులకు అవగాహన కల్పిస్తూ  అతి వేగం తో ప్రయాణం చేసే కొందరి వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయని , ప్రతిఒక్కరు అతివేగంగా వాహనాలు నడపవద్దని , ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ  నెమ్మదిగా వాహనాలు నడిపి సంతోషంగా మీ  గమ్య స్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మీ భద్రతే మా బాధ్యత అని పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.  

Tags:  

Advertisement

LatestNews

హైదరాబాద్ లో 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో
డా. కోడి శ్రీనివాసులును సన్మానించిన రాష్ట్ర ప్రయివేట్ పాఠశాలల సమాఖ్య
షేక్ సాదిక్ అలీ  లేరని నమ్మలేకపోతున్నాను - హెచ్ టూ వో ఫొండేషన్ చైర్మెన్ శ్రీలత కొరడ
మా దుకాణ సముదాయాలు మాకు కావాలి - ముగ్గురు ఆడపిల్లల ఆవేదన
పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  . 
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - కూర రమేష్, కార్యదర్శి రంగారెడ్డి  జిల్లా సమాచార హక్కు వికాస సమితి .