ప్రజలకు మంచి చేసే ఏ పనినైనా ప్రోత్సహించాల్సిందే -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
పర్యావరణహిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ప్రారంభోత్సవంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
భూమి, గాలి, నీళ్లలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతుంది
కాలుష్యరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి
విశ్వంభర, చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం లోని ఇండస్ట్రియల్ పార్కులో కాలుష్య రహిత పర్యావరణహిత క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే రమణి ఇండస్ట్రీస్ ని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు మునుగోడు శాసనసభ్యులుకోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ప్రస్తుతం పాల్తిన్ క్యారీ బ్యాగ్స్ వల్ల భూమి నీరు గాలి కాలుష్యంగా మారాయని, కాలుష్యానికి హాని చేయకుండా ఉండే క్యారీ బ్యాగ్స్ ని ఉత్పత్తి చేసే టెక్నాలజీని రూపొందించిన డి ఆర్ డి ఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణానికి మేలు చేసే క్యారీ బ్యాగ్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమను స్థాపించిన రమణి ఇండస్ట్రీస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలు స్థాపించాలని అటువంటి వారికి మా పూర్తి సహకారం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో కాలుష్యం ఎక్కువై ప్రజలు రోగాల బారిన పడుతున్న తీరు మనసుని కలచి వేస్తుందని ఆవేదన చెందారు... పర్యావరణహితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి, డి ఆర్ డి ఓ సైంటిస్ట్ వీరబ్రహ్మం లతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు....