కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నుముక -అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నుముక -అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 

విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :  సేవాదళ్ జిల్లా స్థాయి సమావేశం శనివారం సాయంత్రం ఏడు గంటలకు దమ్మపేట లోని వినాయక ఫంక్షన్ హాల్ లో  నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే  జారె ఆదినారాయణ హాజరై  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు సేవాదళ్ మరింత ముందుకు తీసుకెల్లాలని ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి సేవాదళ్ వారధిగా నిలవాలన్నారు.  1978లో ఏర్పాటైన సేవాదళ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందని ఈ సంస్థ యువతలో  సేవా భావం పెంపొందేలా పనిచేస్తుందన్నారు అనేక సామాజిక కార్యకలాపాలు నిర్వహించటం విద్య ఆరోగ్యం సామాన్య ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి సేవాదళ్ పాత్ర చాలా కీలకమైంది అన్నారు.  నవంబర్ 20వ తారీకు గాంధీభవన్లో జరిగే శతాబ్ద దినోత్సవాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భారీగా వెళ్లాలని సూచించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ స్టేట్ సెక్రటరీ కోదుమూరి దయాకర్ రావు, జిల్లా అధ్యక్షులు కేశ బోయిన నరసింహారావు, నియోజకవర్గ అధ్యక్షులు బండారు మహేష్, జిల్లా జనరల్ సెక్రెటరీ కోదుమూరి కోటేశ్వరరావు, సేవాదళ్ నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

Tags: