మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం  

మృతుడి కుటుంబానికి మిత్రుల ఆర్థిక సాయం  

విశ్వంభర, చండూర్ : పుల్లెంల గ్రామంలో ఇటీవల అనారోగ్య సమస్యతో అకాల మరణం చెందిన చిరకాల స్నేహితుడు వట్టికోటి సైదులు కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు సాటి మిత్రులు. పుల్లెంల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1998 - 99, పదవ తరగతి  బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూపాయలు 60,000/- నగదును సేకరించి ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు వట్టికోటి సైదులు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకూరి రమేష్, పాలకూరి శ్రీనివాస్ ,బొబ్బల శేఖర్ రెడ్డి,బొడ్డు సైదులు,భూతరాజు చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

హైదరాబాద్ లో 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో
డా. కోడి శ్రీనివాసులును సన్మానించిన రాష్ట్ర ప్రయివేట్ పాఠశాలల సమాఖ్య
షేక్ సాదిక్ అలీ  లేరని నమ్మలేకపోతున్నాను - హెచ్ టూ వో ఫొండేషన్ చైర్మెన్ శ్రీలత కొరడ
మా దుకాణ సముదాయాలు మాకు కావాలి - ముగ్గురు ఆడపిల్లల ఆవేదన
పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  . 
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - కూర రమేష్, కార్యదర్శి రంగారెడ్డి  జిల్లా సమాచార హక్కు వికాస సమితి .