రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ లో చండూర్ విద్యార్థుల ప్రతిభ - -మాస్టర్ కారింగు రవి ని సన్మానించిన నిర్వాహకులు 

రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ లో చండూర్ విద్యార్థుల ప్రతిభ - -మాస్టర్ కారింగు రవి ని సన్మానించిన నిర్వాహకులు 

 -పైనిర్ షోటకాన్ కరాటే లో పాల్గొన్న 17 మంది విద్యార్థులు 

విశ్వంభర, హైద్రాబాద్ ; తెలంగాణ రాష్ట్ర స్థాయి మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ 2024 ను పురస్కరించుకొని పైనిర్ షోటకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజాపూర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో నల్గొండ జిల్లా  చండూర్ కు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు.  ఆదివారం నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న 17 మంది విద్యార్థులు పతకాలు సాధించారు. చండూర్ మండలంలోని గాంధీజీ, గీతా , కృష్ణవేణి  పాఠశాలల నుండి 17 మంది పాల్గొన్నారని మాస్టర్ కారింగు రవి తెలిపారు. 17 మంది విద్యార్థులకు పతకాలు రావడం సంతోషంగా ఉందని మాస్టర్ రవి అన్నారు.  పైనిర్ షోటకాన్ కరాటే లో  కారింగు అభిరామ్ , సంగెపు హర్ష, సంకోజు మణిదీప్ ఈ ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. ఏడుగురు విద్యార్థులు అయిన  కారింగు మోక్షలక్ష్మి, సంగెపు గాయత్రి, జే. ఓం,  సంగెపు జాశ్వంత్, కావలి శశాంక్, ఐతరాజు జశ్వంత్, సంగెపు చందు వెండి పతకాలు సాధించుకున్నారు. మరో 7 గురు విద్యార్థులకు  సంగెపు అభిరామ్, కారింగు అనురూప్, సంకోజు సాయి ప్రణయ్, ఇరిగి బానుతేజ, బుచ్చాలా దినేష్, సంగెపు బద్రెష్, బొమ్మకంటి రేవంత్ కాంస్య పతకాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మాస్టర్ అయిన కారింగు రవి ని సన్మానించి అభినందనలు తెలిపారు నిర్వాహకులు . రాపోలు సుదర్శన్, జపాన్ కరాటే అసోసియేషన్ అఫ్ ఇండియా తెలంగాణ చీఫ్ ఇన్సక్టర్, పలువురు మాస్టర్లు  తదితరులు పాల్గొన్నారు. 

Tags: