మా దుకాణ సముదాయాలు మాకు కావాలి - ముగ్గురు ఆడపిల్లల ఆవేదన

మా దుకాణ సముదాయాలు మాకు కావాలి - ముగ్గురు ఆడపిల్లల ఆవేదన

విశ్వంభర, ఎల్బీనగర్ : తండ్రి ముగ్గురు కూతుర్లకు రాసిచ్చిన మూడు వ్యాపార సముదాయాలను కొట్టేయడానికి అన్నదమ్ములు కుట్రలు చేసి దాడికి పాల్పడడంతో పాటు నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మా తండ్రిగారి ద్వారా సంక్రమించిన మా ఆస్తి మాకు కావాలంటూ ముగ్గురు ఆడపిల్లలు రాధిక, ధనలక్ష్మి, రాధ ఈ సందర్భంగా గురువారం స్థలం వద్ద రిజిస్ట్రేషన్ పేపర్లతో ఆందోళనకు దిగారు. నీరాటి రాజలింగంకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. చైతన్యపురి జాతీయ రహదారి పక్కన సర్వేనెంబర్ 96, 109,110,111లో ఇంటి నెంబరు 2-126లో 1174 గజాల స్థలంలో ఆడపిల్లలకు 72 గజాల స్థలంలో ఉన్న మూడు వ్యాపార సముదాయాలను 1995లో తండ్రి రాజలింగం గిఫ్ట్ డిడ్ చేశారు. అప్పటినుంచి ఆ మూడు వ్యాపార సముదాయాల ద్వారా వస్తున్న అద్దెలతో ఆడపిల్లలు జీవనం సాగిస్తున్నారు. కాగా ఇటీవల తప్పుడు పత్రాలు సృష్టించిన ఇద్దరు అన్నదమ్ములు నీరటీ రాజు, శ్రీనివాస్ 1174 స్థలం మొత్తంలో భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. మాకు తండ్రి ఇచ్చిన మూడు వ్యాపార సముదాయాలను కూల్చివేసి నిర్మాణాలు జరపడంలో భాగంగా మా మూడు వ్యాపార సముదాయాలను కూల్చివేశారు. ఈ విషయమై తాము అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాపై దాడికి పాల్పడ్డారు. మూడు వ్యాపార సముదాయాలలో అద్దెకు ఉన్న వారిపై కూడా దాడి చేసి కులం పేరుతో దూషించడం జరిగింది. ఈ విషయమై తాము పోలీసులను ఆశ్రయించగా రాజు, శ్రీనివాసులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయినప్పటికీ వారు అధికారులను అడ్డుపెట్టుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. మాకు కేటాయించిన మూడు వ్యాపార సముదాయాల లో ఉన్న 76 గజాల స్థలాన్ని మాకు చెందే విధంగా పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇతరులకు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ విషయమై మాకు న్యాయం చేయాలని బి. రాధిక, ధనలక్ష్మి, రాధలు వేడుకుంటున్నారు. ఆస్తి స్వాదీనం చేసుకున్న వారిపై పోలీసు కేసులు నమోదు చేశారు.

Tags:  

Advertisement

LatestNews

హైదరాబాద్ లో 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో
డా. కోడి శ్రీనివాసులును సన్మానించిన రాష్ట్ర ప్రయివేట్ పాఠశాలల సమాఖ్య
షేక్ సాదిక్ అలీ  లేరని నమ్మలేకపోతున్నాను - హెచ్ టూ వో ఫొండేషన్ చైర్మెన్ శ్రీలత కొరడ
మా దుకాణ సముదాయాలు మాకు కావాలి - ముగ్గురు ఆడపిల్లల ఆవేదన
పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  . 
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - కూర రమేష్, కార్యదర్శి రంగారెడ్డి  జిల్లా సమాచార హక్కు వికాస సమితి .