గాంధీజీ లో ఘనంగా బాలల దినోత్సవం 

 గాంధీజీ లో ఘనంగా బాలల దినోత్సవం 

బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం...
   --- ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు 

విశ్వంభర, చండూరు : అందరూ అనుభవించే బాల్యం... భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన వరం అని అన్నారు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. స్థానిక గాంధీజీ విద్యాసంస్థల యందు నవంబర్ 14, జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా గురువారంనాడు జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభం, శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులని, అందుకు సూచికగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారని, అలాగే మనదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటామన్నారు, నెహ్రూ కు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారన్నారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రు అని ప్రేమగా పిలిచేవారన్నారు. భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈరోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు సాధిస్తారన్నారు. దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించారు. వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, విజయ కుమారి, తరుణ్ మాస్టర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-11-14 at 16.55.45

 

Read More పారా లీగల్ వాలంటీర్లు వారధిలా ఉండాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి.

Tags: