మత్స్యకారుల అభివృద్ధిపై మైసూర్ లో పర్యటించిన ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయి
On
విశ్వంభర, హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మత్స్యకారుల అభివృద్ధికి నూతన పాలసీని తీసుకురానుంది.ఇందులో భాగంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మైసూర్ లో పర్యటించింది.మైసూర్ సీటీ మత్స్య శాఖ కార్యాలయం లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కు కర్ణాటక రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మేనేజంగ్ డైరెక్టర్ ఆర్ గణేశా మరియు వారి సిబ్బంది మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు మత్స్య సంస్థ యొక్క నిర్మాణం, చేపల పెంపకం, విక్రయలు, ఔట్ లెట్ వివరాలను మత్స్య శాఖ అధికారులు వారికి వివరించారు.