విద్యుత్ ను ఆదా చేస్తే విద్యుత్ ను ఉత్పత్తి చేసినట్లే: ఎస్ ఈ చంగారి మాధవ రెడ్డి.
విద్యుత్ వెలుగు జాతికి మెరుగు.
గ్రామీణ విద్యుదీకరణ జాతి ప్రగతికి నాంది.
విద్యుత్ ను పొదుపు గా వాడండి.
సకాలం లో బిల్లులు చెల్లించి మెరుగైన సేవలు పొందండి.
విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరం
విశ్వంభర, ఎల్బీనగర్ : విద్యుత్ ను ఆదా చేస్తే విద్యుత్ ను ఉత్పత్తి చేసినట్లే అని సరూర్ నగర్ సర్కిల్ ఎస్ ఈ చంగారి మాధవ రెడ్డి అన్నారు. ఆదివారం విద్యుత్ వినీయోగ దారుల దినోత్సవం సందర్భంగా హయత్ నగర్ లో కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగ దారుల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కారం చేయాలి అని అధికారులకు సూచించారు. శారద నగర్ కాలనీ లో 2 అంతర్గత పొల్స్ ఏర్పాటు చేయాలి అని ,పెరిగిన చెట్ల కొమ్మలు కొట్టి వేయాలి అని పిర్యాదు అందడం తో 24 గంటల్లో సమస్య పరిష్కరించాలి అని ఏ ఈ నాగరాజు ను ఆదేశించారు. టి జి ఎస్ పి డి సి ఎల్ ఆప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని నెల నెల బిల్లు లు చెల్లింపు ల తో పాటు ఏవైనా సమస్యలు ఉన్న ఆ యాప్ లో పిర్యాదు చేయవచ్చు అని, 24 గంటలు తమ సిబ్బంది అందుబాటు లో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తారు అని తెలిపారు. విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తెగి పడితే దగ్గర్లో ఉన్న విద్యుత్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. నాణ్యత గల పరికరాలను కొని విద్యుత్ని ఆదా చేయండి. నాణ్యత గల ఐఎస్ఐ కెపాసిటర్లను అమర్చుకోవాలి.
ప్రతి విద్యుత్ యూనిట్ వ్యర్థం మన ప్రగతికి ఒక మెట్టు వెనకంజ అని అన్నారు. విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరం అని అన్నారు. మొత్తం వ్రాత పూర్వకంగా 6 పిర్యాదులు, మౌఖికంగా మరో 4 వచ్చాయి అని తెలిపారు.
నవంబర్ 3 వ తేది నే కాకుండా ఎప్పటి సమస్య ను అప్పుడు పరిస్కరిస్తం అని తెలిపారు. 1912 సేవలు కూడా సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. ఎస్ ఈ, డి ఈ స్థాయి లో పరిష్కారం కానీ సమస్యలు ఉంటే కన్స్యూమర్ గ్రీవెన్స్ సెల్ కు , 040 23431228 లో ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఢీ ఈ రాజ రాం రెడ్డి, ఎస్ ఎ ఓ రమణ రెడ్డి, ఏ డీ ఈ విజయ భాస్కర్, ఏ ఈ లు శ్రీనివాస చారి, నాగ రాజు, శంకర్, ఏం డి పాషా కాద్రి వినియోగ దారులు పాల్గొన్నారు.