కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి - కూర రమేష్, కార్యదర్శి రంగారెడ్డి జిల్లా సమాచార హక్కు వికాస సమితి .
విశ్వంభర, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా చేపడుతున్న కుల గణన సమగ్ర సర్వే ఎంతో అద్భుతమైన చారిత్రాత్మక నిర్ణయమని రంగారెడ్డి జిల్లా సమాచార హక్కు వికాస సమితి కార్యదర్శి కూర రమేష్ అన్నారు. అయితే కుల గణన సర్వేకు సంబందించిన అధికారులు , వాలంటీర్లు ఇంటింటి కి వచ్చి మీ కుటుంబ సమాచార వివరాలు అడిగినప్పుడు మీ వద్ద ఉన్న విద్యార్హత , ఆధార్ కార్డు లపై ఉన్న కులం , పేరు లను సరైన విధంగా నమోదు చేయించుకోగలరు. కులం , పేరు కు ముందు కానీ, తరవాత కానీ గౌరవ పదాలను కలుపుకుంటూ నమోదు చేయించుకున్నట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. సంక్షేమ పథకాల ఎంపికలో కానీ, ఉద్యోగ ఎంపికలో కానీ , బ్యాంకు ల ఖాతాల నిర్వహణలో కానీ నామిని గా ఉండి వారసత్వ హక్కుల ద్వారా వచ్చే ఆస్తుల విషయంలో కానీ పలు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ప్రజలందరూ సరైన పేరు ను, కులం పేరు ను నమోదు చేసుకోవాలని ప్రత్యేకంగా అవగాహన పెంచుటకు సమాచార హక్కు వికాస సమితి ప్రజా చైతన్యం కొరకు తెలియజేస్తున్నామని ఒక ప్రకటన లో తెలిపారు.