డా. కోడి శ్రీనివాసులును సన్మానించిన రాష్ట్ర ప్రయివేట్ పాఠశాలల సమాఖ్య

డా. కోడి శ్రీనివాసులును సన్మానించిన రాష్ట్ర ప్రయివేట్ పాఠశాలల సమాఖ్య

అవార్డు గ్రహీత కు ఆత్మీయ సన్మానం

 విశ్వంభర, చండూరు : సామాజిక సేవ రంగంలో ముందుంటూ, ఇటీవల కాలంలో మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు-2024 ను అందుకున్న గాంధీజీ ఫౌండేషన్ మరియు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులును శుక్రవారం నాడు స్థానిక గాంధీజీ విద్యాసంస్థల యందు  రాష్ట్ర  ప్రైవేట్ పాఠశాల సమాఖ్య ఘనంగా సత్కరించారు.  ఈ సందర్భంగా  రాష్ట్ర బాధ్యులు శ్రీపతి శేఖర్ రెడ్డి, గోపిడి నారాయణరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలకు ఏ సమస్యలు వచ్చిన తన సమస్యగా భావించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ.. విద్యాసంస్థలను నిర్వహిస్తూ సామాజిక సేవా రంగంలో ముందుంటూ, మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు 2024ను సాధించడం గర్వంగా భావిస్తున్నామని, మునుముందు మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట్ల అనంతరెడ్డి, పుచ్చకాయల వెంకటరెడ్డి, నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోన వెంకటేశ్వరరావు, కోశాధికారి మట్ట చెన్నయ్య గౌడ్, దయాకర్ రెడ్డి, సత్యం, శ్రీనివాస్, యోగేశ్వరరావు,  నల్లగొండ ఉపాధ్యక్షులు శిరంశెట్టి శ్రీధర్ బాబు, నల్లగొండ టౌన్ అధ్యక్షులు అజీజ్, జవహర్, యాదాద్రి భువనగిరి అధ్యక్షులు డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి, సూర్యాపేట ప్రధాన కార్యదర్శి పగడాల ఉపేందర్ రెడ్డి, ఎలినేని రాధాకృష్ణ, యాదాద్రి భువనగిరి ప్రధాన కార్యదర్శి మిర్యాల దుర్గాప్రసాద్, సింగిరెడ్డి ప్రభాకర్, సరికొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: