మానవత్వం చాటుతున్న  స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవ్యాల్

మానవత్వం చాటుతున్న  స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవ్యాల్

విశ్వంభర, నాంపల్లి : కేతపల్లి గ్రామానికి చెందిన పల్లేటి మహేష్,యాదమ్మ దంపతులు అనారోగ్య కారణాల వల్ల మరణించారు. వారి ముగ్గురు పిల్లల చదువుల, జీవన దీన  పరిస్థితిని ప్రభుత్వ ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త గురిజ మహేష్ స్ఫూర్తి ఫౌండేషన్ (హైదరాబాద్) స్థాపకులు శ్రీవ్యాల్ కి తెలియజేసారు. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న పూజ, పదవ తరగతి చదువుతున్న పవన్, ఏడవ తరగతి చదువుతున్న జయంత్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువులు కొనసాగించడానికి, వారికి నిత్యవసర సరుకుల కోసం ప్రతి నెల 10,000 Rs చొప్పున 7 నెలల వరకు 70,000 Rs సహాయం అందిస్తామని స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపకులు శ్రీవ్యాల్  హామీ ఇచ్చారు. ఈ నెల సహాయం 10,000 Rs ప్రభుత్వ ఉపాధ్యాయులు,సామాజిక కార్యకర్త గురిజ మహేష్ పిల్లల బంధువులు దామెర దేవేందర్,సందె తిరుమలయ్య  ఆధ్వర్యంలో పిల్లలకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్త గురిజ మహేష్ తల్లిదండ్రులు లేని, నిరాదరణకు గురైన పిల్లలు, నిరాదరణకు గురైన వృద్ధులు, దివ్యాంగులు  ఎవరైనా ఉంటే తమ ఫోన్ నెంబర్ 9182498463 కు  సమాచారం అందివ్వాలని, అటువంటి వారికి  వీలైన సహాయం అందజేస్తామని తెలిపారు.

Tags: