కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  . 

కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  . 

ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  

విశ్వంభర,హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా చేపడుతున్న కుల గణన సమగ్ర సర్వే ఎంతో అద్భుతమైన చారిత్రాత్మక నిర్ణయమని పద్మశాలి రాజ్యాధికార సమితి, గౌరవ అధ్యక్షుడు ఏలే మహేష్ అన్నారు. అయితే కుల గణన సర్వేకు సంబందించిన అధికారులు , వాలంటీర్లు ఇంటింటి కి వచ్చి  మీ కుటుంబ సమాచార వివరాలు అడిగినప్పుడు మీ వద్ద ఉన్న విద్యార్హత , ఆధార్ కార్డు లపై ఉన్న కులం , పేరు లను సరైన విధంగా నమోదు చేయించుకోగలరు. కులం , పేరు కు ముందు కానీ, తరవాత కానీ గౌరవ పదాలను కలుపుకుంటూ నమోదు చేయించుకున్నట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి.  సంక్షేమ పథకాల ఎంపికలో కానీ, ఉద్యోగ ఎంపికలో కానీ , బ్యాంకు ల ఖాతాల నిర్వహణలో కానీ నామిని గా  ఉండి వారసత్వ హక్కుల ద్వారా వచ్చే ఆస్తుల విషయంలో కానీ పలు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ప్రజలందరూ సరైన పేరు ను, కులం పేరు ను నమోదు చేసుకోవాలని ప్రత్యేకంగా అవగాహన పెంచుటకు  సమాచార హక్కు వికాస సమితి ప్రజా చైతన్యం కొరకు తెలియజేస్తున్నామని ఒక ప్రకటన లో తెలిపారు

Tags:  

Advertisement

LatestNews

హైదరాబాద్ లో 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో
డా. కోడి శ్రీనివాసులును సన్మానించిన రాష్ట్ర ప్రయివేట్ పాఠశాలల సమాఖ్య
షేక్ సాదిక్ అలీ  లేరని నమ్మలేకపోతున్నాను - హెచ్ టూ వో ఫొండేషన్ చైర్మెన్ శ్రీలత కొరడ
మా దుకాణ సముదాయాలు మాకు కావాలి - ముగ్గురు ఆడపిల్లల ఆవేదన
పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - ఏలే మహేష్ , గౌరవ అధ్యక్షుడు పద్మశాలి రాజ్యాధికార సమితి  . 
కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - కూర రమేష్, కార్యదర్శి రంగారెడ్డి  జిల్లా సమాచార హక్కు వికాస సమితి .