సన్ షైన్ లో ఘనంగా బాలల దినోత్సవం, ఫుడ్ కార్నివాల్
విశ్వంభర, చండూర్ : భారత మొదటి ప్రధాని పండిట్ జావైహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చండూర్ సన్ షైన్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని నెహ్రూ చిత్రపటానికి పూలమాలను అలంకరించి ఘనంగా నిర్వహించారు. పౌష్టికాహార లోపం వల్ల చిన్నారులలో ఎదుగుదల తక్కువగా ఉండడం మొదలగు వాటి గురించి తెలియజేస్తూ బాలల దినోత్సవం సందర్భంగా పౌష్టిక ఆహారం గురించి తెలియజేయడం కొరకు పాఠశాలలో విద్యార్థుల చేత చేయించిన వంటల గురించి వివరిస్తూ వాటిని ఏ విధంగా ఎంత మోతాదులో స్వీకరించాలో తెలియజేస్తూ ఫుడ్ కార్నివాల్ ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పాఠశాలలో నిర్వహించిన ఫ్యాన్సీ డ్రెస్ షోలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు వివిధ వేషధారణలతో అలరించారు. సాంస్కృతి కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శనల ద్వారా విద్యార్థులను అలరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ నెహ్రూ కి పిల్లలు అంటే ఎంతో ఇష్టమని అందుకే వారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈరోజు నిర్వహించినటువంటి ఫుడ్ కార్నివాల్ ద్వారా పిల్లల్లో పౌష్టిక ఆహారం గురించి తెలియజేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు. ఫాన్సీ డ్రెస్ షోలో అలరించిన విద్యార్థులను మరియు నృత్య ప్రదర్శన ద్వారా అలరించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కోడి సుష్మ గారు, రవికాంత్, లతీఫ్ పాషా, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.