దోమల నివారణకు వారంవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం

WhatsApp Image 2024-07-26 at 16.54.45_282343f4

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 26 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం తిమ్మాపూరం గ్రామంలో శుక్రవారం రోజు గ్రామ ప్రత్యేక అధికారి ఐబీ డిఈ సునీల్ ప్రసాద్ ఆధ్వర్యంలో వారంవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా కాలనీలలో కలియ తిరుగుతూ దోమల నివారణ కార్యక్రమo నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలం కారణంగా దోమలు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించాలని మరియు ఇంటి ముందు పనికిరాని వస్తువులను తీసివేయడం, నీటి గుంతలలో ఉండే నీటిని తొలగించడం చేయాలని లేనియెడల దోమలు నిలిచిఉన్న నీటిలో గుడ్లు పెట్టడం ద్వారా వాటి నుండి దోమలు  ఏర్పడి డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉందని అన్నారు.వారు మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని,కాబట్టి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.ఎస్సీ కాలనీ, బిసి కాలనీ, రెడ్డి కాలనీ వాసులకు డ్రైడే ఫ్రైడే పైన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష , ఉపాధి హామీ ఏఫ్ఏ ఎన్ రవిందర్ రెడ్డి, పంచాయతీ తాజా ఉప సర్పంచ్ తోల్పునూరి అంజయ్య గౌడ్,అంగన్వాడీ ఆయా ఎండీ నస్రీన్, గ్రామ పంచాయతీ సిబ్బంది దేవరాజు రాజశేఖర్, వేముల రాములమ్మ, బట్టు బిక్షపతి, కోల మల్లయ్య,ఉపాధి హామీ కూలీలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Read More రోగులను పట్టి పీడిస్తున్న ప్రవేట్ ఆసుపత్రులు