పుస్తెలు తాకట్టు పెట్టి పిల్లలు పస్తులు ఉండకుండా చూస్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులు

WhatsApp Image 2024-07-27 at 15.13.18_28e8391c 27 జూలై 2024 విశ్వంభర కోరుట్ల  : - భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం కోరుట్లలో మధ్యాహ్న భోజన కార్మికులు వారి వారి సమస్యల గురించి సమావేశమయ్యారు 22 సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పటినుండి నిర్విరామంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుంది కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు మారిన నెరవేరడం లేదు అని కే భాగ్య కోరుట్ల మండల అధ్యక్షురాలు అన్నారు నేడు కోడుగుడ్డు ధర 7 రూపాయలు ఉంటే ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలు చెల్లిస్తుంది వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు మూడు వేల ఉపకార వేతనం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వరకు ఉపకార వేతనం పెంచుతామని ప్రభుత్వం ఏర్పడిన ఇంతవరకు ఎట్లాంటి ప్రకటన మధ్యాహ్న భోజన కార్మికులకు చేయలేదని అన్నారు వచ్చే మూడు వేల రూపాయల వేతనం రెండు సార్లు చెల్లిస్తున్నారని డిసెంబర్ నెల నుండి ఇంతవరకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేవని వాపోయారు ప్రభుత్వం ప్రతినెల జీతాలను మరియు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు చిన్న మెట్పల్లి గ్రామానికి చెందిన పద్మ మాట్లాడుతూ పుస్తెలతాడులు తాకట్టు పెట్టి అందిన కాడ అప్పులు చేసి పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నామని 22 సంవత్సరాల నుండి స్కూలు పిల్లల ను సొంత పిల్లగా చూస్తూ ఆహారాన్ని ఇస్తున్నామని ప్రభుత్వం దయ తలచి జీతాలు పెంచి బిల్లులు సకాలంలో అందేటట్టు చేయాలని కోరారు జోహేరా బేగం మాట్లాడుతూ వ్యవసాయ కూలీకి సైతం ప్రతిరోజు 300 నుండి 500 వరకు కూలి వస్తుందని మాకు ప్రతిరోజు 100 రూపాయలు మాత్రమే పడుతుందని ప్రభుత్వం జరుగుచున్న అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్లో మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు పెరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు కార్మిక నాయకుడు సుతారి రాములు అధ్యక్షతన డిఇఓ జగిత్యాల గారికి మరియు ఎంఈఓ గారికి వినతి పత్రాలు అందజేయడానికి వచ్చామని అన్నారు కార్యక్రమంలో పద్మ భాగ్య జమున కట్ట పుష్ప పల్లికొండ హరిగా దేవక్క మరాఠీ సునీత చంద్రకళ సల్మా సబియా బేగం రహీం ఉన్నిసా జోహేరా బేగం తదితరులు పాల్గొన్నారు.