తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి పథకాలపై అవగాహన సదస్సు

WhatsApp Image 2024-07-27 at 15.51.37_4bcd6a5e28.07.2024 విశ్వంబర మెట్పల్లి : -  మెట్పల్లి మున్సిపల్ సమావేశ మందిరంలో  ఈరోజు  మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో మహిళా శక్తి పథకాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్  మోహన్ గారు మెప్మ a o శ్రీనివాస్ గౌడ్, డీఎంసీ సునీత, టీఎంసీ సోమిడి శివ, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, c.o జ్యోతి గార్లు పాల్గొన్నారు.
కమిషనర్ మోహన్ గారు మాట్లాడుతూ మహిళా  సమాఖ్య అధ్యక్షులు,ఆర్పీ లు మహిళా మండలి సభ్యులకు మహిళా శక్తి పథకాలను వివరించాలని అలాగే మహిళా అభిరుచి చేయూత అందించాలని మహిళ క్యాంటీన్ శ్రీనిధి లింకేజీ బ్యాంకు లింకేజీ ద్వారా రెండు కోట్ల 20 లక్షల రూపాయలు రుణాలు మున్సిపాలిటీకి నిధులు కేటాయించారని దీనిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళా గ్రూపులు ముందుకు రావాలని మహిళా సంఘ సభ్యులు రెండు లక్షల బీమా సౌకర్యము శ్రీనిధి ద్వారా ప్రమాదవశత్తు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు సౌకర్యాలు ఉన్నాయని దీని ద్వారా లబ్ధి పొందేందుకు అదేవిధంగా ఫుడ్ క్యాంటీన్సు మకట్కులు ప్యాలాలు తయారు చేసే చిన్న పరిశ్రమలు ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసి స్కూల్ డ్రెస్సులు అంగడి వాడి పిల్లలకు ఇచ్చే డ్రస్సులు ప్రభుత్వ ద్వారా మహిళా సంఘాల ద్వారా ఇప్పించడం ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్డు క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉన్నాయని దీనిని మహిళా సంఘాల వారు ముందుకు వచ్చేలా వారికి అవగాహన చేయాలని చిన్న పరిశ్రమ మహిళలు ముందుకు వచ్చేలా రుణాలు ఇప్పించి మహిళలకు మహిళా సంఘాల వారికి లబ్ధి చేకూర్చాలని అన్నారు .WhatsApp Image 2024-07-27 at 15.51.37_16cea45f