సందర్శించిన అనుభవంతో శాసనసభ వేదికగా చేసిన తప్పులు ఒప్పుకోండి

కెటి రామారావు వైఖరి దొంగనే దొంగా దొంగా అని అరచినట్టుంది

ఏముఖం పెట్టుకొని ప్రాజెక్టులు సందర్శిస్తున్నారు

కెటి రామారావు బృందం ప్రాజెక్టుల సందర్శన పై సుడా చైర్మన్ కోమటిరెడ్డి ఫైర్

WhatsApp Image 2024-07-26 at 17.35.29_47e9d72fవిశ్వంబర కరీంనగర్ జూలై   26 : - కెటి రామారావు బృందం ప్రాజెక్టుల సందర్శన దొంగనే దొంగా దొంగా అని అరచినట్టుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసి నీటినిల్వకు ఆస్కారం లేకుండా చేసి ఏముఖం పెట్టుకొని ప్రాజెక్టులు సందర్శిస్తున్నారని అన్నారు.ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శనలో  అధికారులతో మాట్లాడితే నలభై అయిదు శాతం వర్శాపాతం తక్కువ నమోదైందని అన్నారని చెప్పిన కెటి రామారావు ఎల్ఎండి ప్రాజెక్ట్ నిండలేదని దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందని నరేందర్ రెడ్డి అన్నారు.నేనే ఇంజనీరును అని ఎవరిమాట వినక మెడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగడానికి కారణమైన కేసిఆర్ ఆదేశిస్తే వచ్చామని చెప్పుకుంటున్న కెటి రామారావు సందర్శించిన అనుభవంతో వాస్తవాలు అసెంబ్లీ వేదికగా చెప్పి తప్పులను ఒప్పుకోవాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ ప్రతిపాదించినట్టు తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే తక్కువ వ్యయంతో నిర్మాణం అయి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేవని గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడమే కాకుండా నీటి నిల్వకు ఉపయోగ పడకుండా పోయిందని నరేందర్ రెడ్డి అన్నారు.గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు నిండే పరిస్థితి ఉంది మేము సందర్శించడం వల్లనే నీళ్ళు వచ్చాయని చెప్పుకోవడానికి ఈ సందర్శన కార్యక్రమం పెట్టుకున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.బండెడు ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు వెళ్లినట్టు కెటి రామారావు ప్రాజెక్టుల సందర్శన ఉందని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు.రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు మాత్రమే మిగులుతారని ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీలకు వెళ్ళడం ఖాయం అని నరేందర్ రెడ్డి అన్నారు.చిత్తశుద్ధితో పని చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు చూస్తూ ఊరుకోరని తరమికొడతారని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.ఈ విలేఖరుల సమావేశంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజొద్దిన్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ నాయక్,అబ్దుల్ రహెమాన్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,పొరండ్ల రమేష్,విద్యాసాగర్,మెతుకు కాంతయ్య,ఖమ్రొద్ధిన్,మ్యాకల నర్సయ్య, దండి రవీందర్,కుర్ర పోచయ్య,దన్న సింగ్,షబానా మహమ్మద్,ముల్కల కవిత,జ్యోతి రెడ్డి,హసీనా,తిరుమల, మహాలక్ష్మి,కీర్తి కుమార్,షేహెన్ష,అష్రఫ్,పెద్దిగారి తిరుపతి, నెల్లి నరేష్,వడ్డే వెంకట్ రెడ్డి,లయక్,జిలుకర రమేష్,మెరాజ్,కొట్టె ప్రభాకర్,అస్తపురం రమేష్,లింగమూర్తి,ఖలీల్,బషీర్,శిరీష్,అనిల్ కుమార్,ఉప్పరి అజయ్,శారద,మాసుం ఖాన్,రాజ్ కుమార్,సుధాకర్,సర్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.