కార్గిల్ విజయ్ దివస్ 25 ఏళ్లు సందర్భంగా భారీ ర్యాలీ 

 

WhatsApp Image 2024-07-26 at 16.18.36_43282942విశ్వంభర-బషీర్ బాగ్ : కార్గిల్ యుద్ధం భారతదేశ చరిత్ర ఉన్నంతవరకు గుర్తుండిపోయే యుద్ధమని కస్తూర్బా గాంధీ డిగ్రీ,  పీజీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.రాజేశ్వరి అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని మారేడ్పల్లిలోని కస్తూరిబా గాంధీ డిగ్రీ, పీజీ మహిళా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టీ బెటాలియన్ విద్యార్థినులతో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీలో ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. భారత సైనికుల త్యాగాలను భారతదేశ ప్రతి పౌరుడు గుర్తించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్సిసి ఆఫీసర్ మేజర్ డాక్టర్ డి. జయ సుధా మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం  మనందరి కర్తవ్యం అని, సుమారు 500 మంది భారత జవాన్లు అమరవీరులయ్యారని , కార్గిల్ యుద్ధంలో అమలులైన పౌరుల జ్ఞాపకార్థం కార్గిల్ వార్ మెమోరియల్ను లడక్ సమీపంలోని ద్రాస్ టౌన్ లో ఏర్పాటు చేశారని  గుర్తు చేశారు .ఆర్మీ సుబేదార్ ఎం కె సింగ్ ప్రసంగిస్తూ పాకిస్తాన్ ఆక్రమించిన అన్ని ప్రాంతాలను భారత్ తన ఆధీనంలోకి తీసుకున్నాక 26 జూలై 1999లో యుద్ధం ముగిసిందని భార త్రివర్ణ పతాకాన్ని ఈ సగర్భంగా ఎగిరి వేసిందని అందుకే జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ మన దేశ ప్రజలందరం జరుపుకుంటామని అన్నారు.లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రాయల్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ లయన్ గోపిశెట్టి ప్రమోద్ మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ ప్రతి భారతీయ హృదయాలలో దేశభక్తి జ్వాలలను వెలిగిస్తుందని మనది ఐక్యమైన జాతి అని గుర్తు చేశారు. సైనికుల వల్లే దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారని భారత సైనికుల సేవలను మరవరానిదని వివరించారు.ఈ సందర్భంగా కస్తూర్బా మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ 1 టి బెటాలియన్ విద్యార్థినిలు లెక్చరర్స్ అధిక సంఖ్యలో ప్లకార్డులు చేతబట్టి జాతీయ జెండాలతో కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరుల జవాన్లకు జోహార్ అని నినాదాలు చేస్తూ ర్యాలీలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ నరోత్తం రెడ్డి, కార్యదర్శి ఫహిముద్దీన్ ,ఎన్సిసి బెటాలియన్ హల్దార్ జితేందర్ తివారి ,కుమారి కోకిల ,కుమారి అనుజ్ఞ ,కుమారి మహిమ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Read More మొట్టమొదటిసారిగా 40 అడుగుల భారీ విగ్రహం -