తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనిర్వచనీయమైన పాత్రని నిర్వహించినారు

WhatsApp Image 2024-07-27 at 12.49.31_1f69a85c

ఎల్బీనగర్ విశ్వంభర Date 27.7.2024 :-తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనిర్వచనీయమైన పాత్రని నిర్వహించినారని దానికి కావలసిన సిద్ధాంత భూమికను ఇచ్చినారని  తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు తెలియజేసినారుఆయన మరణానంతరము తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి సంవత్సరము అతని యాది లో ప్రముఖ సామాజికవేత్తలతోనూ, విద్యావేత్తలతోను స్మారక ఉపన్యాసము . గత 13 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని విద్యావంతుల వేదిక కొనసాగిస్తా ఉంది ఈ సంవత్సరము  తేదీ 28.7.2024 ఆదివారం రోజున మధ్యాహ్నము  రెండు గంటలకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరుగుతుంది ఈ సభలో స్మారక ఉపన్యాసము చేయుటకు ది వైర్ పత్రిక సీనియర్ ఎడిటర్ శ్రీమతి అర్ఫాఖానుమ్ శర్వాణి గారు ప్రసంగిస్తారుకావున సామాజిక ఉద్యమకారులు విద్యా వేత్తలు అన్ని వర్గాల ప్రజలు ఈ సభలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైన నివాళి అర్పించాలని డాక్టర్ తిప్పర్తి యాదయ్య గారు కోరినారు ఈ సభ యొక్క పోస్టర్ను సాగరిక స్కూల్ నందు ఆవిష్కరించారు  తెలంగాణ విద్యావంతుల వేదిక  నగర ప్రధాన కార్యదర్శి అంకుష్ చే రణ్ గారు  ప్రొఫెసర్ ఇనప ఉపేందర్ గారు అభ్యుదయ రచయితల సంఘము రాష్ట్ర నాయకులు కేవీఎల్ గారు  రంగారెడ్డి జిల్లా  పల్లె వినయ్ గారు నగేష్ అప్ప గారు కారింగు బిక్షం గారు తిప్పర్తి మహేష్ గారు ప్రముఖ సినీ గేయ రచయిత అభి ఉప్పల్ గారు  పోస్టర్ను ఆవిష్కరించినారు.

Read More బిగ్ బ్రేకింగ్ - కవితకు బెయిల్