వికలాంగుల సంక్షేమనికి  బడ్జెట్లో మొండి చెయ్యి 

షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట బడ్జెట్ పత్రాలను దగ్ధం చేస్తూ నిరసన

రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి

 

WhatsApp Image 2024-07-26 at 12.40.39_cbca1ea5

 విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంకు ప్రవేశపెట్టిన 2,91,159 కోట్ల బడ్జెట్లో వికలాంగుల సంక్షేమం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని,బడ్జెట్ ను సవరించి 5శాతం నిధులు కేటాయించాలని,నిధులు కేటాయించక పోవడన్ని నిరసిస్తూ షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట దివ్యంగుల ఆద్వర్యంలో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జెఎస్పి పార్టీ నాయకులు మర్ల ఆంజనేయులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతు దివ్యాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. 6 గ్యారంటీ లలో   6000 పింఛన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి అందలం ఎక్కాక దాని పెన్షన్ల పెంపు ఊసు ఎత్తడమే  లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో 137 అంశాలను అసెంబ్లీలో మాట్లాడారు. ఎక్కడ  కూడా వికలాంగుల సంక్షేమం కోసం ప్రస్తావించలేదు. 12.02శాతం ఉన్న వికలాంగుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఎటువంటిదో అర్థం అవుతుంది. పంచాయతీ రాజ్, గ్రామీణఅభివృద్ధి శాఖకు 29816 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో ఆసరా పెన్షన్స్ పెంపు ఎట్లా సాధ్యం.వికలాంగుల పెన్షన్ 6000లకు, ఇతర పెన్షన్ 4000 లకు పెంచేందుకు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. వికలాంగుల రుణాలు, సహాయ పరికరాలు, స్కాలర్ షిప్స్ వంటి వాటికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అభయ హస్తం 6 హామీలలో చేయూతకు నిధులు ఎందుకు కేటాయించలేదు. ఆదాయాన్ని తగ్గించుకునేందుకు సంస్కరణలు అమలు చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పడం అంటే సంక్షేమ పథకాలను రద్దు చేయాలనే కుట్ర దాగి ఉంది. ప్రజా పంపిణి వ్యవస్థకు 3836 కోట్లు కేటాయించారు.దీనితో వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వడం ఆచరణలో సాధ్యం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వైఖరి మార్చుకొని పునరాలోచన చేయాలన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చేగురు శేఖర్ గౌడ్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మహిళ నాయకులు  అబ్బే సంతోష, కుసుమ, మనీలా, మల్లేష్, నర్సింలు, బాల్రాజ్, ఆంజనేయులు, ఎండి మస్కుద్ తదితరులు పాల్గొన్నారు.

Read More మిద్దెల జితేందర్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్  స్టేట్ సెక్రటరీ కొదుమూరి దయాకర్