భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తాం: అమెరికా

భారత్-పాక్ ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తాం: అమెరికా

  • అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు
  • పాక్‌ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు
  • విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడి
  • ఉగ్రవాదం వీడే వరకు చర్చలకు తావులేదంటున్న భారత్ 

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను ప్రస్తావించారు. భారత్, పాక్ రెండింటితోనూ బంధానికి అమెరికా విలువనిస్తోందని తెలిపారు.  ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలు సైతం అందులో భాగమేనని మాథ్యూమిల్లర్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు పాక్‌ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు. 

ఇదిలా ఉండగా, పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే విధానాన్ని పాక్‌కు భారత్‌ సూచనలు చేస్తోంది. ఆ తర్వాతే ఇరు దేశాల మధ్య చర్చలు, సత్సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయినా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ భద్రతకు ముప్పు తలపెట్టే కుటిల యత్నాలను ఆపడంలేదు. ఇలా ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలకు పిలిస్తే తాము అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావు లేదని తేల్చిచెప్పింది.

Read More ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం... మను బాకర్ సరికొత్త రికార్డ్

Related Posts