దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ - రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ -  రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

 

హైదరాబాద్, విశ్వంభర :-కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు, స్వయం ప్రతిపత్తిని తీవ్రంగా వ్యతిరేకించి, ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమించి, దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్, ధో ప్రధాన్, ధో నిషాన్ నహీ ఛలేంగే అంటూ నినదిస్తూ, నెహ్రూ ప్రభుత్వ  విధానాలకు వ్యతిరేకంగా  సైద్ధాంతిక కట్టుబాట్లకు అనుగుణంగా అఖండ భారత్ కోసం పోరాటం చేశారని కొనియాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను తొలగించి జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో కలపడం ద్వారా దేశాన్ని ఒక బలమైన… ఐక్య దేశంగా చూడాలనే డాక్టర్ ముఖర్జీ గారి కలను సాకారం చేసిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎండగట్టారు. భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ  జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ , ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More సాయిబాబా మందిరానికి సామాజిక సేవకులు భాస్కర్ గౌడ్ విరాళం