AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు
విశ్వంభర, హైదరాబాద్ :- అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని Aipso రాష్ట్ర కార్యాలయం వద్ద ఫహల్గాం వద్ద టెర్రరిస్టుల దాడిని ఖండిస్తూ, మృతులకు నివాళి ఘటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, Aipso రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేపీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు జి నాగేశ్వరరావు, కాచం సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఉగ్రవాదం చాలా ప్రమాదకరమని, దేశ సార్వభౌమాధికారాన్ని ,ప్రగతిని ,మానవ హక్కులను హరిస్తుందని ఈ నిజానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడాలని దేశంలో సెక్యులరిజం సామరస్యం పరిడవిల్లాలని అన్నారు. గతంలో దేశంలో టెర్రరిస్ట్ దాడుల వలన ప్రజలు అమాయకులు, మృత్యువాత పడ్డారని, పాలకులు ఈ దాడులను అరికట్టాలని, అన్నారు. కాశ్మీర్ లోని పహల్గాం వద్ద టెర్రరిస్టుల దాడి వలన 26 మంది మృత్యువాత పడ్డారని మరొక 12 మంది తీవ్రంగా గాయాలకు గురయ్యారని చెప్పారు. దేశంలోని బార్డర్లో పహారాకాస్తున్నటువంటి భారత సైన్యానికి కావలసినటువంటి ఆధునిక ఆయుధాలను, సరఫరా చేయటంలో అవసరమైనన్ని సైనిక పోస్టులను భర్తీ చేయడంలో వారికి కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేయటంలో కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ ఉగ్రవాదం అంతం కొరకు ప్రపంచ శాంతి కొరకు పాలకులు చర్యలు చేపట్టాలనిగుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శాంతి సంఘం నాయకులు రామరాజు, రవి కిషోర్, జె.కె శ్రీనివాస్ , ఇరుగు శ్రీధర్, నరేంద్ర ప్రసాద్, సుధావన్, జాదవ్ రజాక్, హర్షద్ అహ్మద్, పుష్పలత, వి రాజి రెడ్డి ,నక్క కృష్ణ గౌడ్, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఉగ్రవాద దాడిలో పాల్గొన్న వృద్ధులకు క్యాండిడేట్స్ తో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.



