సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ 

సన్నబియ్యం పంపిణీలో పాల్గొన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ 

విశ్వంభర, చండూర్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  ఆదేశానుసారం చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో శనివారం సన్న బియ్యం పంపిణీని  చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్.సి డిపార్ట్మెంట్ నల్గొండ జిల్లా చైర్మన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కురుపాటి గణేష్, లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు, అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ముందు రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామన్నారు.  పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి లకు తెలంగాణ ప్రజల తరఫున మునుగోడు నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలిపారు.  గత ప్రభుత్వం ఉప ఎన్నికలు వస్తేనే రేషన్ కార్డులు ఇచ్చారన్నారు.  తమ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉప ఎన్నికల్లో లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత తనది మా ప్రభుత్వం అన్నారు. అక్రమంగా మద్యం అమ్మిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాసాల పాండురంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి రంగారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూతరాజు యాదయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కురుపాటి శ్రీను, ఎలవర్తి శ్రీను,తీగల కృష్ణయ్య,అనుమల్ల యాదయ్య, కురుపాటి చిన్న నాగేష్, తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: