ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఘనంగా అంబెడ్కర్ జయంతి
విశ్వంభర, ఎల్బీనగర్ : తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ , ఎల్బీనగర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎరుకల నాంచారమ్మ కాలనీ (డబల్ బెడ్ రూమ్) నుండి ఎల్బీనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ తేవడం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ , తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ , ఎల్బీ నగర్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు ఉండ్రాతి రవికుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా జయంతి ర్యాలీ ముఖ్యఅతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ హాజరయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపురం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అనాధలకు తెలంగాణ ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కందెల వెంకటేశ్వర, మాదగాని నరేష్ , నిమ్మల భరత్, కావలి నరసింహ, వనం గంగయ్య, జగన్నాథం, గంగయ్య, సిద్ధిని స్వామి, ఉండ్రా తి ఎల్లయ్య తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గం కమిటీ తదితరులు పాల్గొన్నారు.



