డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు
జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశీధర్ రెడ్డి
On
విశ్వంభర : భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం మరియు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించరు .ఈ సందర్భంగా నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం డా బీ.ఆర్ అంబేద్కర్ కృషిని, గౌరవించుకుంటూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో పెట్టడం జరిగిందనీ, అంబేద్కర్ జీవితానికి సంబంధించిన అయిదు ముఖ్యమైన ప్రదేశాలను బిజెపి ప్రభుత్వం ‘పంచతీర్థాలుగా’ వాటిని చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలుగా తీర్చిదిద్ది దేశ ప్రజలంతా ఆ ప్రాంతాలను సందర్శించి నివాళులర్పించే విధంగా అభివృద్ధి చేశామని
బాబా సాహెబ్ అంబేద్కర్ నూటముప్పై నాల్గొవా జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జాన్నే మొగిలి,దుప్పటి భద్రయ్య,ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్యాల రాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్ జిల్లా నాయకులు దొంగల రాజేందర,సామల మధుసూదన్ రెడ్డి, మందల రఘునాథరెడ్డి,ఊరటి మునేందర్,నవీన్ రావు, ఎర్ర రాకేష్ రెడ్డి,శంకర్, కార్యకర్తలు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.



