కేసీఆర్ పాలన స్వర్ణ యుగం - .ప్రజల గుండెల్లో ఉద్యమ నేత కెసిఆర్
విశ్వంభర, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ యూత్ గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గుడిమల్ల రమేష్ బీఆర్ఎస్ యూత్ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వం లోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొగుళ్లపల్లి గ్రామంలోని అన్ని వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం బీఆర్ఎస్ యూత్ గ్రామ కమిటీని ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ యూత్ గ్రామ కమిటీ అధ్యక్షునిగా వనం కార్తీక్, యూత్ గ్రామ అధ్యక్షునిగా వనం కార్తీక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడిమల్ల రమేష్ తెలిపారు. ఉపాధ్యక్షులుగా గోస్కుల కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా బండి నాగరాజు, కార్యదర్శిగా చాట్ల అజయ్, కోశాధికారిగా వనం రాజశేఖర్, కార్యవర్గ సభ్యులుగా వనం భద్రయ్య, బోడ శ్రీను, అర్షం మహేష్, అదర్ సండే నవీన్, తిప్పారపు రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు పడిదల జగ్గారావు, దేవునూరి కుమారస్వామి, చెక్క శ్రీధర్, వనం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.



