అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
విశ్వంభర, పరిగి : రాజ్యాంగ ప్రదాత, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మబందువు భారతరత్న డాక్టర్ భీంరావు అంబెడ్కర్ అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం బిఆర్ అంబేద్కర్ 134 జయంతి ఉత్సవాల్లో భాగంగా పరిగి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ....మహనీయులు ఇచ్చిన స్పూర్తి భవిష్యత్తు సమాజానికి సామాజిక బాధ్యత, సమాజ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.రాజ్యాంగమే ఈ దేశానికి, ప్రజలకు రక్ష, అంబేద్కర్రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. రాజ్యాంగం కింద మనం ఎలా స్వేచ్ఛగా బతుకున్నామో రాజ్యాంగ పరిరక్షణకు ఎలా వ్యవహరించాలో భవిష్యత్తు తరాలకు తెలవాలని సూచించారు. బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి,డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి పార్థసారథి, మున్సిపల్ వైస్ చైర్మన్ అయూబ్, డిసిసి ప్రధాన కార్యదర్శిలు హనుమంతు, రామకృష్ణ, డిసిసి ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సురేఖ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాలాది శ్రీనివాస్ గుప్తా, చిన్న నరసింహులు, రామకృష్ణారెడ్డి,నాగవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.



