ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 

ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ -  -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 

  • -పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోకల వెంకన్న 

విశ్వంభర, చండూర్ : బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సందర్బంగా  చండూర్ మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్  బిఆర్ఎస్ పార్టీ జెండాను పట్టణ కేంద్రంలో ఘనంగా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,  మాజీ ఎంపిపి తోకల వెంకన్న పాల్గొని కొబ్బరికాయ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కొత్తపాటి సతీష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి నేటికీ 25 సం .రాల సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు , కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. నాడు కెసిఆర్ ఒక్కడితో ప్రారంభం అయినా పార్టీ అనితర ఉద్యమ ప్రయాణం చేపట్టి తెలంగాణ స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్ట మొదటి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకొని , రెండవసారి కూడా ఒంటిచేత్తో అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు పదేళ్ల కాలంలో దేశంలోనే ఆదర్శం గా  సంక్షేమ పాలనను అందించిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.   వరంగల్ లో  జరిగే రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున పట్టణ కేంద్రం నుండి బయలు దేరనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుంటి వెంకటేశం , తేలుకుంట్ల చంద్ర శేఖర్ ,ఇడికోజు నాగరాజు , రాపోలు జగదీశ్వర్ , భూతరాజు యాదగిరి , ఇరిగి రాజ్ కుమార్ , వెంకన్న , శ్రీను , నర్సింహా తదితరులు పాల్గొన్నారు. WhatsApp Image 2025-04-27 at 11.34.53 AM

Tags: