చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు
On
విశ్వంభర, చండూర్ ;- శ్రీ శ్రీనివాస హాస్పిటల్ సంతోష్ నగర్ , హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మలక్ పేట్ వారి ఆధ్వర్యంలో గాంధీజీ విద్య సంస్థలు, గాంధీజీ ఫౌండేషన్ , ట్రస్మా నల్గొండ జిల్లా చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం చండూర్ లోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా షుగర్ , బిపి , బోన్ డెన్సిటీ పరీక్షలు , వివిధ రకాల అయినా జబ్బులకు, కిడ్నీ , గుండె వ్యాధిగ్రస్తులకు పరీక్షలు చేసి , పలు సూచనలను అందిస్తూ డాక్టర్లు మెడిసిన్ అందజేశారు. దాదాపు ఈ వైద్య శిబిరంలో 200 మంది వరకు వైద్య సేవలను ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




