డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
విశ్వంభర, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బి ఆర్ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్, ఎమ్మెల్సీ కవిత, బి ఆర్ స్ నాయకులతో కలిసి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదట హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన వారి చిత్ర పఠానికి పూలు జల్లి నివాళులు అర్పించారు. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించారని బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.ప్రజా హక్కుల కోసం చేసిన పోరాటం ప్రపంచానికే ఆదర్శం అని అంబేద్కర్‌తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది అన్నారు.అంబేద్కర్ అందరి వాడు కానీ తెలంగాణకు మరింత దగ్గరి వాడని అందుకే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టారని,దేశంలో ఏ సచివాలయం కూడా అంబేద్కర్ పేరు లేదు, మన తెలంగాణలో మాత్రమే ఉందని,ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేశారని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి బషీర్బాగ్ చౌరస్తా తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. తదనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ , కెసిఆర్ స్థాపించిన ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ స్ ముఖ్య నాయకులు మంత్రులు కొప్పుల ఈశ్వర్,శ్రీనివాస్ గౌడ్,పొన్నాల లక్సయ్య, మధుసూదన చారీ,దాసోజు శ్రవణ్,ర్ స్ ప్రవీణ్ కుమార్,బాల్క సుమన్, ఎర్రోళ శ్రీనివాస్, తుల ఉమా,మరియు బి ఆర్ స్ కార్యకర్తలు పాల్గొన్నారు.



