కోదాడ డిపోలో ఘనంగా అంబేద్కర్ జయంతి
విశ్వంభర, కోదాడ :- భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని కోదాడ డిపోలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని డిపో మేనేజర్ బి శ్రీనివాసరావు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయసాధనలో ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి.నాగశ్రీ, సూపర్ డెంట్ సిహెచ్. నాగిరెడ్డి, ఎం ఎఫ్ రాజేష్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కె.వి రత్నం, కే. ఉప్పలయ్య , ఆర్ సీతయ్య, బి.రామ్మూర్తి, కే.భాగ్యరావు, వైయస్ పీఎం .రావు, కే. బాబు, ఎల్.రాజశేఖర్, పి. జితేందర్, టి సంజయ్, ముఖ్య అతిథులుగా రీజినల్ ఎస్సీ ఎస్టీ.ఆర్టీసీ జిల్లా సెక్రటరీ కడియం రమేష్ , జిల్లా అధ్యక్షులు లింగ నాయక్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డివి రత్నం , ఉప కార్యదర్శి వీ.అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



