అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యములో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యములో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, నల్లగొండ జిల్లా : మునుగోడు మండల కేంద్రంలో మునుగోడు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యములో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు గాదరి శరణార్ధి, గోలి చెన్నకేశవులు, గోలి మారయ్య,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పెరుమాల్ల ప్రమోద్ కుమార్ లు సంఘం సభ్యులతో, గ్రామస్తులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు..అనంతరం చౌరస్తాలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెరుమాల్ల నరసింహ,బొల్లు  సైదులు,ముచ్ఛపోతుల శ్రీకాంత్, రెడ్డిమల్ల యాదగిరి,పెరుమాల్ల ప్రణయ్ కుమార్,బెల్లపు బాల శివరాజు,పెరుమాల్ల ప్రతాప్, పెరుమాల్ల వెంకటేశ్వర్లు,కట్ట నరసింహ,ముచ్చపోతుల తరుణ్,గంగుల కృష్ణయ్య పాల్గొన్నారు.

Tags: