అంబేద్కర్ కు నివాళులు అర్పించిన కుడా చైర్మన్
విశ్వంభర, హన్మకొండ జిల్లా : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఘన నివాళులు అర్పించారు. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ కార్యాలయంలో వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, హార్టికల్చర్ అధికారి ఆసిఫ్ గాయాలు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షులు తుమ్మనపెళ్ళి శ్రీనివాస్, దుపాకి సంతోష్, మాజీ ఎంపిపి భీమగాని సౌజన్య, చడా కొమురా రెడ్డి, జన్ను బాబు మండల డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.



