అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
On
విశ్వంభర, రామన్నపేట: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో రామన్నపేట మండల బీజేపీ అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది. అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ గారి జీవిత విధానం ప్రతి విద్యార్థికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాటిపాముల శ్రీకృష్ణ గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, బిజెపి నాయకులు బట్టే రమేష్, రేపాక లింగస్వామి, బెజ్జంకి శివకుమార్, మల్లయ్య, సంతోష్, మేడి మధు, బొడ్డుపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.



