బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో రాణించిన సాయి భార్గవ్ రెడ్డి
On
విశ్వంభర, త్రిపురారం; త్రిపురారం మండల కేంద్రానికి చెందిన అనుముల సాయి భార్గవ్ రెడ్డి వివిధ బాక్సింగ్ పోటీలో విజయపథంలో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా ఈ నెల 11 తారీఖు నుండి 13వ తారీకు వరకు 7th యూత్ స్టేట్ ఛాంపియన్షిప్ లాలాపేట జి.హెచ్.ఎం.సి గ్రౌండ్లో జరిగిన టోర్నమెంటులో 60-65 కేజీల విభాగంలో బాక్సింగ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. ఈ విజయ పరంపరలో మోడల్ సాధించడంతో ఈనెల 20 నుండి 26 వరకు ఉత్తరప్రదేశ్ లో జరుగు నటువంటి జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ లో బాక్సింగ్ ఛాంపియన్ అనుముల సాయి భార్గవ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించడున్నాడు. ఈ సందర్భంగా సాయి భార్గవ్ రెడ్డికి మిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువురు అభినందనలు తెలిపారు.



