పెద్దఎత్తున కాంగ్రెస్ ను వీడుతున్న నేతలు..
On
విశ్వంభర, సూర్యాపేట ; ముకుమ్మడిగా గులాబీ గూటికి చేరిన ఆత్మకూర్ ఎస్ మండలం మంగలి తండా కాగ్రెస్ శ్రేణులు, సుమారు 70 మంది కాంగ్రెస్ శ్రేణులతో కలిసి BRS లో చేరిన మాజీ సర్పంచ్ లునావత్ నాగరాజు BRS తీర్ధం పుచ్చుకున్నారు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మాజీ ZP వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, PACS చైర్మన్ కొనటం సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, మాజీ వైస్ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షులు ధన సింగ్, క కందగట్ల గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు పోషణ పెళ్లి రాజశేఖర్, బాలాజీ నాయక్, మంగి నాయక్, అమృనాయక్ తదితరులు పాల్గొన్నారు.



