డ్రగ్స్ గంజాయి ఆన్లైన్ బెట్టింగ్ నియంత్రించడానికి డివైఎఫ్ఐ సైకిల్ యాత్ర
విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: డ్రగ్స్ గంజాయి ఆన్లైన్ బెట్టింగ్ మత్తును నియంత్రించడానికి డివైఎఫ్ఐ యువ చైతన్య సైకిల్ యాత్రను నిర్వహించడం జరిగిందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అణగంటి వెంకటేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామం నుండి ఈ సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గంజాయి ఆన్లైన్ బెట్టింగ్ పై యువత చెడు మార్గాలకు వెళ్తూ మద్యానికి గంజాయి మత్తుకు పాటుపడుతూ ప్రాణాలను కోల్పోతున్నారని ఇలాంటి వాటిని నియంత్రించడానికి ఈ సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అయితే గోని విజయ్, గడ్డం వెంకటేష్, దొంతగొని అమరేందర్,ఎండి సలీం, రత్నం, శ్రీకాంత్,దుబ్బాక జగన్, బోదాస్ నరేష్, నత్తి నరేష్, గాజుల మహేష్,జోకు మహేష్ తదితరులు పాల్గొన్నారు.



