నిట్టు శ్రీశైలం ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి
On
విశ్వంభర, ఇబ్రహింపట్నం :- భారతరత్న మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా ఇంచార్జి నిట్టు శ్రీశైలం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాచకొండ దండుమైలారంలో ఘనంగా చేపట్టారు. స్వతంత్ర సమరయోధుడు, సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ,భారతరత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని ఈ సందర్బంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజె వై ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తుంకోజు సాయికుమార్ చారీ, సీనియర్ నాయకులు చింతల నర్సింహ , బూత్ అధ్యక్షులు జంగం వెంకట్ రెడ్డి, చింతల కృష్ణ , ఉదారి తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.



