పీడీఎస్యు  (విజృంభణ), అరుణోదయ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్, జార్జి రెడ్డిల స్మృతి సమావేశం

పీడీఎస్యు  (విజృంభణ), అరుణోదయ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్, జార్జి రెడ్డిల స్మృతి సమావేశం

విశ్వంభర, హైదరాబాద్ ;  మతోన్మాదుల చేతుల్లో దారుణ హత్యకు గురైన విప్లవ ధృవతార కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి, బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిలను పురస్కరించుకొని అరుణోదయ కార్యాలయంలో స్మృతి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అరుణోదయ ఉభయ రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు కామ్రేడ్ విమలక్క తో పాటు, (విజృంభణ) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అల్లూరి విజయ్ లు మాట్లాడుతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీరిరువురికి ఘనంగా విప్లవ నివాళులర్పించారు. మతోన్మాదం సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కుల-మత విద్వేషాలు ప్రదర్శిస్తున్నప్పుడు, పీడిత వర్గ-కుల ఐక్యతను చాటడానికి అన్ని రకాల అసమానతలు రద్దు చేయడానికి ఈ ఇరువురి త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడారు. వర్గ పోరాటాలు-కుల నిర్మూలనా పోరాటాల ఐక్యతను చాటుతూ ఏప్రిల్ మాసాన్ని సామాజిక విప్లవ మాసంగా ప్రకటించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఉస్మానియాలో జార్జి మెమోరియల్ వాక్ లో పాల్గొన్న అరుణోదయ,పీడీఎస్యు (విజృంభణ) జార్జి స్ఫూర్తిని చాటడమే గాకుండా, విప్లవోద్యమం-సామాజికోద్యమం సమైక్యంగా సాగాల్సిన ఆవశ్యకత ఉందని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, గంగారత్నం, బుల్లెట్ వెంకన్న, సంధ్య, తదితరులతో పాటు జంట నగరాల అధ్యక్ష-కార్యదర్శులు రాకేష్, సురేష్ లు,PDSU (విజృంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానీ, కార్యవర్గ సభ్యులు మహేష్, పవన్ తదితరులతోపాటు కళాకారులు పాల్గొన్నారు. బాబాసాహెబ్-జార్జి రెడ్డిలకు నివాళులర్పిస్తూనే, వారి ఆశయ సాధనకు ముందడుగు వేస్తామని ప్రతినబూనారు.

Tags: