కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యం

విశ్వంభర, సూర్యాపేట ; కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివ‍ృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వూర రాంమూర్తి యాదవ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమమోదించినందుకు, బిసిలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఆమోదించినందుకు సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద సిఎం రేవంత్ రెడ్డి నిలువెత్తు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ రెండు బిల్లులను ఆమోదించడం హర్షణీయమన్నారు. అంబేద్కర్ కలలు కన్న సమాజ స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నియోజకవర్గానికి 5వేల మందికి రాయితీ రుణాలను  అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు, బిసిలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ బిల్లుల ఆమోదంలో కృషి చేసిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, రాష్ట్ర పర్యాట అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలకు ప్రత్యేక క‍ృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, నాయకులు నేరేళ్ళ మధు గౌడ్, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Tags: