సర్వేల్ గురుకుల పాఠశాలను సందర్శించిన బుర్రా వెంకటేశం
విశ్వంభర,సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలను సందర్శించిన 1983-84 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న బుర్రా వెంకటేశం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీరుల్లా ఖాన్, పాల్వాయి రజిని, రామ్మోహన్ రావు పాఠశాలను సందర్శించారు. తాను చదివి విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలంతా కలిసి తిరిగి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో మాట్లాడుతూ అందరూ సమయాన్ని చక్కగా వినియోగించుకొని మంచి స్థాయిలో ఉండాలని తెలంగాణకు గర్వకారణంగా నిలవాలని ఆక్షాకించారు. విద్యార్థులచే నిర్మించబడిన సంస్కృతిక కార్యక్రమాల ఆహుతులను అలంకరించాయి. ఇందులో బుర్రా వెంకటేశం రచించిన అమ్మ చేసిన బొమ్మను అనే పాటపై చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రమణ కుమార్, డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్, పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



