ఎస్సి వర్గీకరణ పై మంద కృష్ణ మాదిగ, బీజేపీ మౌనం వీడాలి: డాక్టర్ పిడమర్తి రవి.    

ఎస్సి వర్గీకరణ పై మంద కృష్ణ మాదిగ, బీజేపీ మౌనం వీడాలి: డాక్టర్ పిడమర్తి రవి.    

ప్రెస్ క్లబ్ , హైద్రాబాద్ - విశ్వంభర ;_ ఎస్సీ వర్గీకరణ పై మందకృష్ణ మాదిగ, కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలని ఈ పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోవాలని, ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ దేశంలోనే అతిపెద్ద కులమైన మాదిగల సమస్యకు పరిష్కారం చూపని కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అన్నారు. ప్రధాని మోడీ మరియు బిజెపి పార్టీ కేవలం మాదిగ జాతి ఓటు బ్యాంకును వాడుకోవడానికి మాత్రమే ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇస్తుందని అన్నారు. వర్గీకరణపై ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ మౌనం వీడి వర్గీకరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

 బిజెపి ప్రభుత్వం గత పదేండ్ల  నుంచి ఎన్నికల సమయంలో వర్గీకరణ పై స్పష్టమైన హామీ ఇస్తుంది కానీ గెలిచిన తర్వాత మాదిగ జాతిని వర్గీకరణ అంశాన్ని పక్కదో పట్టిస్తున్నాయి ఎందుకు మాదిగ జాతిని మోసం చేస్తుందో రానున్న రోజుల్లో పల్లె పల్లెకి వెళ్లి బిజెపి కుటిల రాజకీయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెబుతామని అన్నారు.    

  ఒక్కలగడ్డ చంద్రశేఖర్,BN రమేష్,గడ్డ యాదయ్య,బాబురావు,సన్నీ, మొగులయ్య.. మాట్లాడుతూ 

     ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని మాదిగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో వచ్చేనెల 8 9 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐక్య సంఘాలు వెల్లడించాయి. బిజెపి ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ పై తక్షణమే స్పందించి పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన విధంగా ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 

ఢిల్లీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారిని ఆహ్వానిస్తామని ఐక్య సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఒక్కలగడ్డ చంద్రశేఖర్, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బుధాల బాబురావు,మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షుల బిఎన్ రమేష్, మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి సురేందర్ సన్నీ మాదిగ, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, తెలంగాణ దళిత దండు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొగులయ్య, బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, మాదిగ చేసి యూత్ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్, విజయలక్ష్మి, సముద్రాల ప్రశాంత్, దేవరకొండ నరేష్, జోగు గణేష్, లింగంపల్లి మధుకర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

 

 

 

Tags: