పీసీసీ అధ్యక్షుడుని అయిన కార్యకర్తగానే ఉంటా

పీసీసీ అధ్యక్షుడుని అయిన  కార్యకర్తగానే ఉంటా

  • గాంధీ భవన్ దేవాలయం,
  • నాకు గాంధీ భవన్ తో  40 ఏండ్ల అనుభందం ఉంది
  • నా స్థాయి కి నేను పిసిసి అవుతానని అనుకోలేదు.
  • రాజకీయాల్లో ఎంత కష్ట పడి పని చేసిన ఒక్క శాతం అదృష్టం ఉండాలి...
  • టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను మహేశ్‌కుమార్ గౌడ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో సందడి నెలకొంది.సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ వ్వవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పలువురు ఏఐసీసీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మహేశ్‌కుమార్‌ గౌడ్ గన్‌పార్కు నుంచి ర్యాలీగా గాంధీభవన్‌కు వచ్చారు. ర్యాలీ పెద్దఎత్తున వాహనాలు, గుర్రాలు, బగ్గీ వాహనాలు, ఆదివాసీల నృత్యాలు, బోనాలు, శివ సత్తుల ప్రదర్శనలతో జరిగింది.

WhatsApp Image 2024-09-15 at 7.37.14 PM (1)గాంధీ భవన్ లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దమ్ము, ధైర్యంతో కూడిన పోరాటం వల్లే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని నూతన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. రానున్న రోజుల్లోనూ మరింత దమ్ము, ధైర్యం చూపించాల్సి ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకం కార్యకర్తలకు గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేయటంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందని నిరూపితమైందని వెల్లడించారు.

Read More మిద్దెల జితేందర్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్  స్టేట్ సెక్రటరీ కొదుమూరి దయాకర్ 

WhatsApp Image 2024-09-15 at 7.49.15 PM
పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎక్కువ. నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటారు. కానీ సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఏకమవుతారు. అందరం ఏకతాటిమీదకు రావటం చూసినందునే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. - మహేశ్ కుమార్ గౌడ్, నూతన టీపీసీసీ చీఫ్గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని మహేశ్‌కుమార్‌ గౌడ్ తెలిపారు. 

WhatsApp Image 2024-09-15 at 7.49.15 PM (1)కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవటం తెలంగాణ రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేసీఆర్‌ సీఎం అయ్యాకే, తెలంగాణ రాజకీయాల్లో భాష మారిపోయిందని, కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పేందుకే రేవంత్‌రెడ్డి కూడా కాస్త గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పీసీసీ పదవితో నిరూపితమైందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.