వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు సూర్య శ్రావణి అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణిస్తూ రాజకీయాలలో కూడా అడుగులు వేస్తూ రాణించాలని మహిళలను ప్రోత్సహిస్తూ అన్నారు కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం మహిళలను సత్కరించారు. అంతే కాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంగమేశ్వర్ రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మీ సోమశేఖర్ మహిళా ప్రధాన కార్యదర్శి విద్యుల్ లతా మహిళా కోశాధికారి అశ్విని శంకర్ శివకుమార్ దినేష్ పాటిల్ రాచప్ప తదితరుల పాల్గొన్నారు.