ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 

ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 

విశ్వంభర, హైదరాబాదు : ప్రభుత్వ హాస్టల్ల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందని aకృష్ణయ్య అన్నాడు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఆదివారం  జాతీయ బ్యూటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు టి అంజి నీల వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఇందిరాపార్క్ వద్ద వేలాదిమంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన భారీ ధర్నాలో ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు పేదల ఇండ్ల కట్టడానికి ప్రభుత్వ నిర్మాణాలకు మాత్రమే ఉపయోగించాలని అన్నాడు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశాయని అప్పుడు నేను గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మకాలను ఆపివేశారని ఇప్పుడు కూడా ప్రభుత్వ భూములను అమ్మకాలను ఆపివేయాలని ప్రభుత్వ స్థలాల వేలాలకు   వేయరాదని అన్నాడు. బీసీ కాలేజీ హాస్టల్ లో బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ స్థలాలను అమ్మడం వల్ల భావితరాలకు ఏమి మిగలదని  ప్రభుత్వానికి సూచించాడు. హాస్టల్లో గురుకులాలు సౌకర్యాలు లేక జ్ఞాన వికాసం పొందలేక విద్యార్థిలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఇలాంటి విషయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులకు నష్టం చేకూర్చిన వారు అవుతారని  సొంత భవనాలు లేకపోవడం వల్ల అద్దె భవనాలలో  కొనసాగుతున్న హాస్టల్ల కొరకు ప్రభుత్వం ఆలోచించి వారికోసం సొంత భవనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల ఆస్తుల జోలికి వచ్చినట్లయితే విద్యార్థులతో కలిసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించాడు. ఈ కార్యక్రమంలో  బీసీ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 
వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు 
శ్రీ త్యాగరాయగాన సభలో పలువురు జర్నలిస్టులకు సత్కారం 
42% బిల్లులపై సీఎం రేవంత్‌కు డా. వకుళాభరణం బహిరంగ లేఖ
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ ని కోరిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం.