ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ ని కోరిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం.
స్పీకర్ పట్ల సీనియర్ శాసన సభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదు.
On

విశ్వంభర, హైదరాబాద్: : సస్పెన్షన్ పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, సస్పెన్షన్ కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి వివరణ తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది.
సస్పెన్షన్ పై నిర్ణయాన్ని పునర్ పరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ శాసనసభ పక్షం.
జగదీశ్ రెడ్డి మీ గురించి ఏకవచనంతో మాట్లాడలేదని చెప్పారు. సభలో ఉంటే జగదీశ్ రెడ్డి మాట్లాడేవారని... కానీ సస్పెన్షన్ కారణంగా ఆయన సభకు రాలేకపోయారని అన్నారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై పునరాలోచించాలని కోరారు. సభలో జగదీశ్ రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించాలని విన్నవించారు.