బిఎన్ రెడ్డి నగర్ లో ఘనంగా హోలీ సంబురాలు 

బిఎన్ రెడ్డి నగర్ లో ఘనంగా హోలీ సంబురాలు 

విశ్వంభర, ఎల్బీనగర్ : దేశ వ్యాప్తంగా హోలీ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. యువ‌త‌ ఒక‌రిపై ఒక‌రు రంగులు పూసుకుంటూ రంగుల పండుగ‌ హోలీని ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకుంటున్నారు.  బిఎన్ రెడ్డి నగర్ లోని పంచాయతీ రాజ్ టీచర్స్ కాలనీ ఫేస్ 2 లో చిన్నారులు , మహిళలు కలిసి పెద్ద ఎత్తున హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. అందరికి హోలీ శుభాకాంక్షలు అంటూ డాన్స్ స్టెప్పులు వేస్తూ అలరించారు.  "స‌ప్త‌వ‌ర్ణ శోభితం.. స‌క‌ల జ‌నుల సంబురం.. ప్ర‌జ‌లంద‌రికీ హోలీ శుభాకాంక్ష‌లు" అంటూ అలాగే ఈ రంగుల పండుగ‌ను అంద‌రూ వైభ‌వోపేతంగా జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షిణాచారు. ఈ పండుగ అంద‌రీ కుటుంబాల్లో ఆనందాలు నింపాల‌ని కాలనీవాసులు పేర్కొన్నారు.  

Tags: