శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు

శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు

విశ్వంభర, హైదరాబాద్ : శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్‌కు “బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డును సీఎస్ ఆర్ సమ్మిట్ 2025 పురస్కారంగా ప్రకటించింది. ఈ అవార్డు ప్రధానోత్సవం హైదరాబాద్ నగరంలోని శిల్పకళావేదికలో అత్యంత ఘనంగా జరిగింది.

ఈ అవార్డును శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ ఫౌండర్  వేదాల శ్రీనివాస్ , తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిటీ సభ్యులు మరికంటి భవాని రెడ్డి  చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“ఈ గౌరవాన్ని అందించిన మరికంటి భవాని రెడ్డికి, సి ఎస్ ఆర్ సమ్మిట్ 2025 నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వ్యాపారంలో స్థిరమైన విధానాలు, సామాజిక బాధ్యతతో మేళవించినప్పుడు, అది ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది,” అని అన్నారు.

Read More హలాల్ దుకాణాల్లో హిందువులు మాంసం కొనొద్దు - మహారాష్ట్ర ప్రభుత్వం

అంతకుముందు సి ఎస్ ఆర్ సమ్మిట్ సభ్యులు మాట్లాడుతూ,
 వేదాల శ్రీనివాస్, శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ ఫౌండర్‌గా మాత్రమే కాకుండా, సినీ నిర్మాతగా శ్రీమందిరం ప్రొడక్షన్స్ ద్వారా గొప్ప విజయాలు సాధించారు. అలాగే క్లైర్వాయింట్‌గా ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు. ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

శ్రీమందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ ఇప్పటికే అనేక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, సమాజం పట్ల తమ కట్టుబాటును నిరూపిస్తోంది. ఈ అవార్డు వారి సేవలకు గౌరవ సూచకంగా నిలిచింది.

ఈ సంస్థ జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ మెర్చెంట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీగా పేరుపొందింది. అదేవిధంగా, శ్రీమందిరం ప్రొడక్షన్స్ సినీ పరిశ్రమలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సంస్థ ద్వారా వేదాల శ్రీనివాస్ గారు నిర్మించిన తొలి తెలుగు చిత్రం “యమధీర” ప్రేక్షకుల ఆదరణ పొందింది.

Tags: